కభీ ఖుషి కభీ గామ్ సినిమాలో చిన్ని కరీనా కపూర్ గా నటించింది మాళవికారాజ్. పదహారేళ్ళ తర్వాత తెలుగు జయదేవ్ సినిమాలో హీరాయిన్ గా  నటించింది.  ఆమె తండ్రి బాచిరాజ్ ఫిలిం మేకర్. ప్రాముఖనటి అనితా రాజ్ కు ఈమె మేనకోడలు. 2010 నాటి ఫెమినా మిస్ ఇండియా ఫ్యాషన్ మోడల్. ఎన్నో బ్రాండ్స్ రాంప్ వాక్ చేసింది మాళవిక. ‘మాది సినీ కుటుంబం మా అక్క సోనక్షి రాజ్ డిజైనర్ నటన నాకెంతో ఇష్టం. చిన్నప్పుటి నుంచి డాన్స్, డైలాగ్స్, మిమిక్రీ చేయడం నాకు అలవాటు. అలాగే మోడలింగ్ లోకి వెళ్ళాక దానినుంచి నేనెంతో నేర్చుకున్నాను. ఫ్యాషన్ ఇండస్ట్రీగ్రేట్ ర్యాంప్ ప్రపంచానికి సినిమా పూర్తిగా భిన్నం. టాలీవుడ్ లో పనిచేస్తున్నప్పుడు భాష సరిగ్గా రాకపోయినా యూనిట్ చాలా సహకరించారు. అదో ఎమోషనల్ కమర్షియల్ సినిమ. సినిమా బాలనటిగా నటించిన సినిమాలు వేరు. కానీ నేను సినిమా ప్రపంచపు మనిషిని నాకు తెలుసు.’ అంటోంది మాళవిక.

Leave a comment