కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటి శుభ్రతతో పాటు ఇంటి అలంకరణ లో కూడా మార్పులు చాలా అవసరం అంటున్నారు ప్రముఖ డిజైనర్స్. ఈ సమయంలో మార్పులు తప్పనిసరి బాల్కనీ, టెర్రస్, వరండాల్లో తేమ తడి లేకుండా చూసుకోవాలి.సూర్య రశ్మి  ఇంట్లో పడేలా ధారాళంగా గాలి ఇంట్లో కి వచ్చేలా  ఏర్పాటు చేసుకోవాలి.వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు పిల్లలు చదువుకునేందుకు స్టడీ టేబుల్స్, కుర్చీలు వంటివి తక్కువ స్థలంలో అనుకూలంగా ఉండేలా గా సర్దుకోవాలి. ప్లాస్టిక్ వస్తువుల కంటే గాజు, స్టెయిన్లెస్ స్టీల్,   యాంటి మైక్రోబియల్  ఉత్పత్తులను ఉపయోగించుకోవాలి వర్షాలు మొదలవుతాయి  కాబట్టి ఇంటి వరండాలో ఉండే మొక్కలు గుబురుగా  పొదలుగా లేకుండా ట్రిమ్ చేసి దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Leave a comment