కొద్ది పాటి మేకప్ తో ముఖంలో ఎంతో తేడా వస్తుంది. సహజమైన అందానికి నిండుతనం వస్తుంది. అయితే మేకప్ విషయంలో కొద్ది జాగ్రత్తలు అవసరం. చర్మం రంగుకి తగిన ఫౌండేషన్ వాడాలి లేత రంగు చర్మం వుంటే ముదురు రండు ఫౌండేషన్ వాడకూడదు ప్రైమర్ ని అప్పనిసరిగా వాడాలి. అది కనుక లేకపోతే ఫౌండేషన్ త్వరగా చెదిరి పోతుంది. కన్సీలర్ ని చాలా పరిమితంగా వేసుకోవాలి. 40 ఏళ్ళు దాటాక ముదురు రంగు లిప్స్టిక్ వాడకపోవడం మంచిది. వయస్సు పై బడుతున్న కొద్ది పెదవుల ఆకాశం మారుతుంది కనుక లేత రంగులే వాడాలి. కళ్ళకు ఒక కోటింగ్ ఐలైనర్ వాడాలి. ముందుగా వాడితే కనురెప్పలు బరువుగా అనిపిస్తాయి  కనుబోమ్మల్ని వాటి ఆకృతిని దృష్టిలో పెట్టుకుని పెన్సిల్ తో గిసుకోవాలి. సహజంగా ఉండేలా చూసుకోవాలి.

Leave a comment