ఒత్తిడి అలసట కలిగిస్తుంది, అలజడి సృష్టిస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. దానికి ఉత్తమ తెరఫీ శారీరక వ్యాయామం ఇంటా బయటా పనులు ఎక్కువ ఉన్న తీరిక లేకపోయినా కనీసం అరగంట సమయం మనకోసం మనం కేటాయించుకోవాలి. మంచి దుస్తులు ధరించాలి. పాటలు ఇష్టమైతే పాడుకోవాలి ఆప్తులతో మనసు పంచుకోవాలి. యాంత్రికతను ఛేదించాలి. కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడుకోవాలి బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లాలి. లేదా వాళ్లనే ఇళ్లకు ఆహ్వానించాలి. ఏ పార్క్ కో షికారు వెళ్లాలి. ఇవన్నీ ఒత్తిడిని తగ్గించటమే కాక ఆనందాన్ని నింపుతాయి.

Leave a comment