ఈ సీజన్ చల్లగా హాయిగా ఉంటుంది కానీ శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. కనుక అలసట అనిపిస్తూ ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రత మేనేజ్ చేయటానికి జీవక్రియ పెరుగుతుంది. దీనివల్ల చలిఅనిపించినప్పుడు  వణుకు వస్తుంటుంది. శరీరం ఉషోగ్రతను ఉత్పత్తి చేసుకునే మార్గం ఇది. అలసటగా ఉందీ అంటే శరీరం త్వరగా వేడి ఉత్పత్తి కోసం క్యాలరీలు దాచుకునే ప్రయత్నం అన్నమాట. అంతేకాక వేసవితో  పోల్చితే కండరాలు లిగమెంట్లు టెండాన్లు ఎక్కువ సఫర్ అవుతాయి. ఇవన్నీ కలిసి ఈ సీజన్ లో తాజాగా ఉండేందుకు దారితీస్తాయి. అలసట ఎదుర్కొనేందుకు వర్కవుట్స్ మిస్ చేయకూడదు. ఎక్కువ క్యాలరీల కోసం శరీరం  కొవ్వును కరిగిస్తుంది కాబట్టి మంచి నాణ్యమైన ప్రోటీన్లు ఫ్యాట్స్ లోడ్ చేసుకోవాలి. చల్లని తియ్యని పానీయాలు దూరంగా ఉంచి ఓ కప్పు కాఫీ ఎంజాయ్ చేయాలి. అవుట్ డోర్ వర్కవుట్స్ కార్డియో చెస్ట్ వర్కవుట్స్ చేయాలి. వార్మప్ మరచి పోవద్దు , వర్కవుట్లకు కండరాలు సిద్ధం కావాలంటే డైనమిక్ స్ట్రెచ్ చేయాలి. వర్కవుట్స్ తర్వాత సక్రమంగా కూల్ అయితే ఎలాంటి నొప్పులూ  సోర్ నెస్ వుండవు.

Leave a comment