అదే పనిగా కంప్యుటర్ తో పని చేసే తప్పని సరిగా కళ్ళకు సంబందించిన వ్యాయామాలు చేయాలంటారు ఎక్స్ పర్ట్స్. కళ్ళను గుండ్రంగా తిప్పి కుడి, ఎదమలకు తిప్పుతూ చేసే ఎక్సర్ సైజు రోజులో చాలా సార్లు చేస్తే అలసట లేకుండా ఉంటుందంటున్నారు. కీరదోసరసంలో గులాబీ నీరు కలిపి ఆ నీటి లో దూదిని తడిపి కాళ్ళపై వుంచుకుంటే అలసట తీరి కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే తేనె, పాలు మిశ్రమం లో  కుడా దుది తడిపి కళ్ళ పై వుంచుకుంటే అలసట పోతుంది. బంగాళ దుంప తురిమి ఆ గుజ్జును కళ్ళ పై పెట్టుకున్నా అలసట తీరటం మాత్రమే కాదు కళ్ళ చుట్టూ నల్లని వలయాలు మాయం అవ్వుతాయి.

Leave a comment