ఇంటిపని ఆఫీస్ పనిలో ఫుల్ టైమ్ గడిచిపోతూ ఇక వర్కవుట్స్ చేసే సమయం మిగలకుండా పోతుంది. కానీ మంచి ఆరోగ్యం కోసం 30 నిమిషాలు అయినా వ్యాయామాం చేయాలి. కొన్ని ప్రాక్టికల్ టిప్స్ తో ఈ వ్యాయామం సాధ్యం. ఇంటికి దగ్గర లోని జిమ్ ఎంచుకోవాలి టెన్షన్ లేని సమయం ప్లాన్ చేసుకోవాలి. జిమ్ వెళ్ళేందుకు కుదరదు అని తేలిపోతే  ఆ అరగంట నడక కోసం కేటాయించాలి. ఉదయమే వాకింగ్ చేయాలని లేదు సాయంత్రం అయినా పర్లేదు. నెలలో కొన్ని రోజులు స్ట్రెంగ్స్ ట్రైనింగ్ తీసుకోవాలి. రోజంతా చురుగ్గా మెట్లేక్కి దిగుతూ ఉండాలి.సెల్ ఫోన్ లో మాట్లాడవలసివస్తే లేచి నడుస్తూ మాట్లాడాలి. వేళ ప్రకారం నిద్రపోవాలి. నెమ్మదిగా శరీరం శక్తి పుంజుకొంటోంది.

Leave a comment