ఒకప్పుడు బొద్దుగా ఉండే అలియా భట్ సినిమాల్లోకి వచ్చాక చాలా నాజుగ్గా అయిపోయింది. క్రమం తప్పని వ్యయామం మంచి ఆహారం ఇలా స్లిమ్ గా ఫిట్ గా ఉండేందుకు తోడ్పడింది అంటుంది అలియా. వర్కవుట్స్ లో ఎక్కువ భాగం శారీరక ధారుడ్యం ,కార్డియో,ఫ్లెక్సిబిలిటికి సంభందించినవి ట్రేడ్ మిల్ ,స్క్వాట్స్,డంబెల్స్ ,క్రంచెస్ వంటివి ఉంటాయి. అతిగా జిమ్ చేసినా శరీరాకృతి పోతుంది. రోజుకు గంట కార్డియో ఎక్సర్ సైజులు పోషక విలువలున్న ఆహారం కార్భో హైడ్రేట్స్ కచ్చితంగా తీసుకుంటేనే అద్భుతమైన ఫలితాలుంటాయి అంటుంది అలియాభట్. అయితే డైట్ లో షుగర్ వదిలేసి పప్పు,రోటీ,అన్నం,కూరగాయలు ,చికెన్,షుగర్ లెస్ టీ మెణులో ఉండాలంటుంది అలియాభట్.

Leave a comment