కోవిడ్ తో ప్రపంచం వణుకుతూ ఉంటే హాంప్షైర్ కు చెందిన మిల్డ్రెడ్, జెర్రీ షాప్పల్స్ అనే 102 ముసలావిడ కోవిడ్ బారిన పడి కోలుకొని కోవిడ్ పోరాటానికి కొత్త ఉత్సాహం ఇచ్చింది. ఈ బామ్మకు 1918 లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ను కూడా జయించిన రికార్డ్ ఉంది. ఈ ఫ్లూ సోకినప్పుడు జెర్రీ 10 నెలల పసిపాప. అప్పట్లో అమెరికాలో ఈ జ్వరం నుంచి బయటపడింది. కాలేజ్ చదువు పూర్తి చేసుకొని,పెళ్ళాడి ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది. టీచర్ గా పని చేసి రైటైడ్ మెంట్ తీసుకొంది. 70 ఏళ్ల వయసులో పెద్ద పేగు,రొమ్ము కాన్సర్ వస్తే దాన్నించీ బయటపడింది. మళ్ళి ఇన్నాళ్లకు 102 వ ఏటా కరోనా వచ్చింది. దీన్ని జయించింది జెర్రీ ఇంకా నిక్షేపంగా 150 ఏళ్ళు జీవిస్తాను అంటోంది జెర్రీ.

Leave a comment