మంచి తిధులు మంచి రోజులు అంటూ ఉండవు. గడుస్తున్న కాలం అంతా మంచిదే. నిజాన్ని గమనిస్తే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి జన్మించింది షష్టి రోజు. దుర్గాదేవికి అష్టమి ప్రీతికరం, శివుడికి బహుళపక్షం ఇష్టం అందులోనూ  ఎంతో ఇష్టం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని తమ పిల్లలు షష్టినాడో అష్టమి నాడో అమావాస్య రోజునో ఇలా దుష్ట తిథుల్లో జన్మిస్తే తమ సంతానానికి ఏ కష్టనష్టాలనైనా వస్తాయని తల్లిదండ్రులు దిగులు పడిపోవటం దండగే. అలా భయపడే అవసరమే లేదు దానికి కారణం జాతకాలు, దాని ఫలితాలు అనేవి, పుట్టిన నక్షత్రం గ్రహాల పైన ఆధారపడి ఉంటాయని కేవలం తిథిని బట్టి కాదని అంటారు విజ్ఞులు.

Leave a comment