సెర్బియా లోని ఆల్ ఫిమేల్ రోమా బ్యాండ్ తన సంగీతం తో శతాబ్దాలుగా ఉన్న పురుషాధిక్య  భావజాలాన్ని బద్దలు కొడుతోంది బాల్య వివాహాల నుంచి గృహహింస వరకు. ఇప్పటి వరకు స్త్రీలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను పాటలుగా పాడు తోంది ఫేమస్ బ్యాండ్. కేవలం సమస్యల గురించి పాడటమే కాదు పాటలో ఒక పరిష్కారం కూడా ఉంటుంది. ఇంత పాపులారిటీ సాధించటం వెనక ఈ బ్యాండ్ కష్టాలు చాలానే ఉన్నాయి. పెళ్లిళ్లు విందులో వాయించు కోండి అని నవ్వారు ,మా పెళ్లి గురించి మాట్లాడేందుకు మీకేం హక్కు ఉంది అని భౌతిక దాడులు చేశారు. అయినా సరే ఆల్ ఫిమేల్ రోమా బ్యాండ్ వెనక్కి తగ్గలేదు. సెర్బియా లో బాల్య వివాహాలు ఎక్కువ దాన్ని అరికట్టేందుకు సెర్బియా ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిన ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన పెద్ద ఫలితం లేదు .కానీ రోమా బ్యాండ్ వల్ల సాంప్రదాయ ఆలోచనల్లో కాస్త మార్పు వస్తోంది. ఫిమేల్ బ్యాండ్ ఇచ్చిన చైతన్యంతో బాల్య వివాహాలకు కొందరు దూరంగా ఉన్నారు. రోమా బ్యాండ్ సభ్యులు తన సొంత అనుభవాలు ఎదురుకొన్న కష్టాలను అనుభవాలను ర్యాప్ అండ్ ట్రెడిషనల్-ఫోక్ బీట్ కలిపేసి పాడుతూ శ్రోతలను ఆకట్టుకొంటున్నారు. ఎవరికోసమో ఎందుకు? మనకోసం మనం అన్న కాన్సెప్ట్ తో ఈ బ్యాండ్ ప్రారంభమయింది ఒకప్పుడు సెర్బియా కే పరిమితం అయిన ఈ బ్యాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను సంపాదించుకొంది.

Leave a comment