లాజిస్టిక్ రంగంలో అమ్మాయిల ప్రాధాన్యత పెంచటంతో పాటు వారి పరిధులు విస్తరించే ఉద్దేశంతో ఆల్ విమెన్ పార్ట్ నర్ డెలివరీ స్టేషన్లు ప్రారంభించామని చెబుతుంది అమెజాన్. ఈ మధ్యకాలంలో సరుకుల దగ్గర నుంచి కూరగాయల నుంచి ప్రతి వస్తువు కొనేందుకు ఈ కామర్స్ వెబ్ సైట్స్ పైనే ఆధారపడటం మామూలైపోయింది. డెలివరీ బాయ్స్ వాతావరణంతో దూరాల తో సంబంధం లేకుండా వస్తువుల్ని డెలివరీ చేస్తున్నారు. కానీ ఈ విషయంలో అమ్మాయిలు తీసిపోరని చెబుతూ ప్రత్యేకంగా డెలివరీ స్టేషన్ లను ప్రారంభిస్తోంది అమెజాన్. తమిళనాడు, గుజరాత్, కేరళ లో ఇప్పటికే ఈ స్టేషన్లు ప్రారంభం అయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ లో ఐదు డెలివరీ స్టేషన్ ప్రారంభించింది అమెజాన్.

Leave a comment