రోజుకో అవకాడో తింటే వృద్ధాప్యంలో ఆలోచనా శక్తి తగ్గకుండా ఉంటుంది అంటున్నారు పరిశోధకులు. అవకాడో లో ల్యూబెస్ అనే వర్ణ ద్రవ్యం అధికంగా ఉంటుంది ఇది మెదడు కణాల పనితీరును ప్రభావితం చేస్తుంది గత పరిశోధనలు తేల్చాయి.దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన పరిశోధనలో 84 మంది వృద్ధులకు రోజుకు అవకాడో ఇచ్చారు .పన్నెండు వారాల తర్వాత అవకాడో తిన్నవారి రక్తంలోనూ,రెటీనా లోనూ ల్యూబెస్ శాతం పెరిగినట్లు గుర్తించారు.వారు గతంలో కన్నా ఎక్కువ చురుకుగా పనులు చేసుకోవటాన్ని గమనించారు. అవకాడో లభ్యం కాని చోట్ల ల్యూబెస్ పుష్కలంగా ఉండే ఆకుకూరలు గుడ్లు తిన్నా మంచిదే అంటున్నారు పరిశోధకులు.

Leave a comment