Categories
నాకు కాస్త భక్తి ఎక్కువే .దేవుడిని అదృష్టాన్ని నమ్ముతాను అంటోంది పూజాహెగ్డే. అందుకేనేమో లైఫ్ లో ఏదైన ఆటుపోట్లు వస్తే బయటికి రావాలంటే ఎవరికైన కాస్త సమయం పడుతుంది. నేనైతే పది,పదిహేను నిమిషాల్లో బయటికి వచ్చేస్తా అంటోంది పూజా. జరిగిపోయిన విషయాల గురించి ఎంతసేపు ఆలోచించినా ఏం ప్రయోజనం .ఆలోచించటమే దండగా అందుకే నేనెప్పుడు భవిస్యత్ పైనే దృష్టిపెడతాను గతాన్ని వెంటనే వదిలేస్తాను. నాకెరీర్ వెనుక కర్త, కర్మ, క్రియ నేనే .నా వెనుక గాఢ్ ఫాదర్ ఎవ్వరు లేరు. అంచేత ఏం చేసిన కాస్త ఆలోచించి చేస్తా. సమస్య లోస్తే కాసేపట్లో వాటిని మనసులోంచి తీసేస్తా అంటోంది పూజా హెగ్డే.