ప్రతి ఇంట్లోనూ అలొవెరా మొక్క పెంచుతున్నారు, దానిలో విటమిన్ సి,ఇ ,బేటా కెరోటిన్ వార్ధక్య ప్రక్రియను నెమ్మదింప జేసి చర్మాన్ని మంచి హైడ్రేషన్ లో ఉంచుతాయి. ఇందులో 90 శాతం నీళ్ళు,అనేక అత్యవసర పోషకాలు ఉంటాయి. ఇంట్లో ఒక్క మొక్క వుంటేఎన్నో ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకోవచ్చు అలొవెరా జెల్,కుకుంబర్ పేస్ట్ పెరుగు తేన కలిపిన ప్యాక్ వేసుకుంటే చర్మం తాజాగా వుంటుంది.  అలొవెరా గుజ్జు,పసుపు తేన కలిపిన ప్యాక్ చర్మానికి తక్షణ మెరుపు ఇస్తుంది. ముల్తానీ మట్టి, అలొవెరా గుజ్జు తేన నిమ్మరసం కలిపిన ప్యాక్ వేసుకోవచ్చు నిమ్మరసం చర్మానికి ట్యానింగ్ తొలిగించటంతో మచ్చల నివారణకు ఉపయోగ పడుతోంది.

Leave a comment