మొటిమల సమస్య టీనేజర్లలో ఎక్కువ. చర్మతత్వాన్ని బట్టి ఎన్నో చిట్కాలు పాటించవచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు. సాధారణ చర్మానికి తేనె కాంబినేషన్ తో కూడిన ప్యాక్స్ పనిచేస్తాయి.పొడి చర్మం ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ ఉన్న క్రీమ్స్ ప్యాక్స్ వేసుకోవాలి.ముల్తానీ మట్టి, శెనగపిండి ప్యాక్ వేసుకోవచ్చు అలాగే కలబంద గుజ్జు కూడా మొటిమలకు మందు లాంటిది. జిడ్డు చర్మం ఉంటే సిట్రస్ ఫేస్ ప్యాక్స్ ఎక్కువ వాడాలి. సబ్బుతో కాకుండా మైల్డ్ ఫేస్ వాష్ తో మొహం కడుక్కోవాలి.ఎలాటి జాగ్రత్తలు తీసుకున్నా మొటిమలు తగ్గకపోతే వైద్య సలహా తీసుకోవచ్చు.

Leave a comment