సంక్షోభ సమయంలో ప్రజలకు ఏదైన చేస్తేనే మనం మనుషులం. ముందుగా సినీ కార్మికుల కోసం విరాళం ఇచ్చాను. ఇంకేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అనితా రెడ్డి మాస్క్ లు చేద్దామంది. వెంటనే ఆ పని మొదలు పెట్టాం. టైలర్లకు ఉపాధి కల్పించినట్లు కూడా ఉంటుంది కదా. ఆలా పని జరుగుతోంది అంటోంది లావణ్య త్రిపాఠి. నా స్టాఫ్ కు జీతం ఇచ్చేశా. వాళ్ళు రాకున్నా ఈ  క్రైసిస్ సమయంలో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకొంటాను చెన్నయ్ లో వరదలు వచ్చినపుడు నావంతు సహాయం చేశాను. ఇలా చెప్పటం ఎబెట్టుగానే ఉంటుంది. కానీ ఇంకొంత మంది ముందుకు వస్తారనే ఆశతో చెప్పాల్సి వస్తోంది. మనలో మనం ఒకళ్ళ కొకళ్ళం సాయం చేసుకొంటేనే అపదల్లోంచి బయట పడతాం అంటోంది లావణ్య త్రిపాఠి.

Leave a comment