గుంటూరు జిల్లాలో గురజాల దగ్గరలో దైద గ్రామంలో స్వయంభువుగా వెలసిన అమరలింగేశ్వర క్షేత్రం…గ్రామంలో ఉన్న గొర్రెల కాపరులు ఒక కొండ గుహలో నుంచి “ఓం నమశ్శివాయ” అనే మంత్రాన్ని నిశ్చలంగా వినపడేసరికి గుహలోకి ప్రవేశించి శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఋషులు పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అది చూసిన భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని కటాక్షం పొందారు.
ఇక్కడ శివరాత్రి, దసరా, కార్తీక మాసంలో వచ్చే విశిష్ట పూజలు నిర్వహిస్తారు.
ఈ గుహలో ఒకేసారి 10 మంది భక్తులు కూర్చుని  శివయ్యకి అభిషేకం చేసుకుని తరించవచ్చు. మరి పదండి అమరలింగేశ్వర క్షేత్రం దర్శించి వద్దాం.

నిత్య ప్రసాదం: కొబ్బరి, ఉపవాసం ఉండి దైవధ్యానం చేసుకోవటం చాలా ఇష్టం,సంతోషం.

    -తోలేటి వెంకట శిరీష

Leave a comment