ఈ కాలం అమ్మాయిలు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. చదువుకుంటూ పార్ట్ టైమ్  జాబ్స్ ఇంటి పనులు పిల్లల పనులు ఉద్యోగాలు ఇలా ఎన్నో పనులు చేయాలంటే మానసికంగా శారీరికంగా చాలా  శక్తిగా ఉండాలి. అంచేత తీసుకునే ఆహారంలో పాల కూర అవిసెలూ టమాటాలు ఓట్స్ ఉండేలా చూసుకోండి. అంటున్నారు. న్యూట్రిషనిస్టులు. పాల కూరలో మేగ్నేషియం పుష్కలంగా ఉంటుంది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అవిసెల్లో వుండే యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు జీర్ణక్రియను సవ్యంగా ఉంచుతాయి. టొమాటోలు కొలెస్ట్రాల్ ను తగ్గించటం తో పాటు గుండె జబ్బులు దాడి చేయకుండా కాపాడతాయి. ఇక ఓట్స్ జీర్ణశక్తిని పెంచి బి.పి  ని కంట్రోల్ లో ఉంచుతాయి. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. మనిషిలో ఉత్సాహం పెంచుతాయి. ఈ నాలుగు ఆహారంలో ఉండేలా చూసుకుంటే ఆరోగ్యం గా  ఉంటారు.

Leave a comment