Categories
అందం,ఆరోగ్యం ఇచ్చే పండ్ల వరసలో వుంటుంది బేరీ పండు. యాపిల్స్ కు సీమ దానిమ్మలకు దగ్గరగా పసుపు ఆకుపచ్చ గోధుమ లేదా ఎరుపు రంగులో ఉండే ఈ పండు రుచి చాలా బావుంటుంది. క్రమం తప్పకుండా ఈ బేరీ పండు తింటే వయసు రిత్యా వచ్చే కండరాల బలహీనతను ఆపవచ్చు. పియర్ గా పిలిచే ఈ పండులో గ్లూకోజ్,ఫుక్ట్రోజ్ పుష్కలంగా ఉండటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఒక్క గ్లాస్ బేరీ పండు రసం తాగితే జ్వరం తగ్గించేంత శక్తి కలుగుతుంది. ఈ పియర్స్ శరీరంలో కాల్షియం నిలిచి వుండేలా చేసి,ఆ ద్వారా ఎముకలు క్షణతను అరికడుతోంది. ఇందులోని పెక్టిన్ కొవ్వును తగ్గించటంలో సాయ పడుతోంది.