బాహుబలిలో రమ్యకృష్ణ ఒక కొత్త ఇమేజ్ సృష్టించుకుంది. ఆమె హీరోయిన్ గా ఎంత పేరు తెచ్చుకున్నారో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఆంతే ప్రాముఖ్యత ఉంది.ఆమె రెమ్యునరేషన్ ఇప్పుడు ఎక్కువ ఉందంటున్నారు.శైలజారెడ్డి అల్లుడులో నటించాక ఆమె తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటించనుంది. అది వెబ్ సిరీస్ గా వస్తుంది.ఈ వెభ్ సిరీస్ లో నటించేందుకు రమ్యకృష్ణ 2కోట్లకు పైగా పారితోషకం అందుకుంటుంది.కొత్త కథలో కొత్త పాత్రలో రమ్యకృష్ణకు ఎన్నో అవకాశాలు సృష్టించి ఇచ్చాయి. శివగామి పాత్రలో ఆమె రెండో ఇన్నింగ్స్ అద్భుతంగా ప్రారంభించిందని చెప్పవచ్చు. నిస్సందేహంగా ఆమె జయలలిత పాత్రలో జీవిస్తుందని విశ్లేషకుల అంచనా.

Leave a comment