ద్యుతిచంద్ స్టార్ స్ప్రింటర్  2018 లోజకార్తా లో జరిగిన ఏషియన్ గేమ్స్ రెండు రజిత పతకాలు సాధించినందుకు ఒడిస్సా ప్రభుత్వం ధృతి కి రెండు కోట్ల రూపాయలు నజరానా ఇచ్చింది. పేద చేనేత కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ద్యుతి తను సంపాదించుకున్న డబ్బుతో ఈసారి ఒలింపిక్స్  వెళ్లేందుకు శిక్షణ తీసుకోవచ్చు కానీ ఆకలి మంటల బాధ, తెలిసిన యువతి. తన ఫ్యూచర్ సంగతి పక్కన పెట్టి లాక్ డౌన్ లో పస్తులున్న తమ గ్రామస్తుల కడుపు నింపడం కోసం డబ్బు ఖర్చు చేసింది.ఆహార పొట్లాలు సరఫరా చేసింది.ధృతి నిజమైన స్టార్ ఆమె కళ్ళకు తన భవిష్యత్ ఒలంపిక్స్ కంటే సాటి వాళ్ళ ఆకలే కనిపించింది.లాక్ డౌన్ ఎందరి లోనో ఉన్న గొప్ప గుణాలు బయటికి తీసి చూపెడుతోంది.

Leave a comment