Categories
మానవత్వం కరుణ దయా వంటి మంచి భావనలతో మంచి వ్యక్తిగా ఉన్నవాళ్ళు మంచి ఆర్టిస్టులు అవుతారు.వినయం,కృతజ్ణత మనల్ని ఎదిగేలా చేస్తాయి అనేది అమ్మ. ఆ మాటాలను ఎప్పుడు నేను మరిచిపోను అంటుంది జాన్వీ కపూర్. ధడక్ సక్సెస్ తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వంలో తబ్త్ లో నటిస్తుంది ఆమె. మా అమ్మ గొప్ప సెలబ్రిటీ అయినా తను మా కోసం ఎన్నో పనులు మాములు గృహిణి లాగ అమ్మలాగా చేసేది. మాకు జుట్టుకు నూనె మసాజ్ లు మార్కెట్ కు వెళ్ళడం కూడా ఆమె లేకపోతే ఎలా ఉంటుందీ? అంత తను చూసుకుంటుందనే ధైర్యం లేదు.అయినా బాధను దిగమింగుకుంటున్నా నటిగా ఆమె పేరు నిలబెట్టాలి.ఆ ఆలోచనల్లోనే అమ్మ నాతో ఉంది అనిపిస్తుంది అంటుంది జాన్వీ.