ఒక ప్రమాదంలో తన ఒక్కగానొక్క పాపను పోగొట్టుకున్నారు సరోజినీ అగర్వాల్ బిడ్డలను పోగొట్టుకున్న బాధ నుంచి కోలుకోలేక పోయారు. సామాజిక చైతన్యం కళ రచయిత్రిగా ఆమెకు పేరుంది పుస్తకాల పైన తనకు వచ్చిన డబ్బంతా దాచి పెట్టారామె. 1985 లో కుమార్తె జ్ఞాపకంగా మనీషా మందిర్ పేరుతో అనాధాశ్రమం స్థాపించారు కాన్పు లోనే తల్లిని పోగొట్టుకున్న మూగ చెవిటి పాప ఆశ్రమానికి తొలిబిడ్డ అలా ఇప్పటికీ మనీషా మందిర్ లో వెయ్యి మందికి పైగా ఆశ్రయం పొందారు. ఇప్పుడు అక్కడ చక్కని గ్రంథాలయం పిల్లలు చదువు  నేర్చుకునేందుకు కావలసిన అవసరమైన సౌకర్యాలన్నీ ఉన్నాయి. సరోజినీ అగర్వాల్ వయస్సు 87 ఏళ్లు ఏ ఆడపిల్లకు సాయం కావాలన్నా ముందుంటారు ఆమె.

Leave a comment