Categories
ఎప్పుడు గ్లామర్ పాత్రలే వేస్తే నాకే కాదు ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. అందుకే కాస్త సాహాసం చేసి మహానటి ఒప్పుకున్నా, అది కత్తి మీదసాము లాంటిదే .ఆహార్యం విషయంలో సావిత్రి గారిని అనుసరించాను. నేను కాస్త బొద్దుగానే ఉంటాను కనుక ఆవిడలా అనిపించటం కష్టం కాలేదు . ఆవిడ నడకలో ఓ సొగసుంది. మూతి విరుపులో ఒక అందం ఉంది. వాటిని నా శరీరంలో ఇముడ్చ్ కోవటం అయితే చాలా కష్టపడి సాధించాను అనిపిస్తుంది అంటుంది కీర్తీ సురేష్ . నిజంగానే గ్లామర్ పాత్రలు నాకు ఇష్టంలేదు నటనకు ఆస్కారం ఉంటే ఎంతైనా కష్టపడతాను . సినిమాలపైన ప్రేమతో ఈ రంగంలోకి వచ్చాను . చాలా కష్టపడితేనే ఈ గుర్తింపు వచ్చింది అంటుంది కీర్తీ సురేష్ .సావిత్రి గారి బయోపిక్ లో లీడ్ రోల్ నాకు రావటం నా అదృష్టం అంటుంది కీర్తీ.