Categories
జులేఖ షేక్ అబుదాబి స్పెషల్ ఒలంపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ లో వాలీబాల్ లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం గెలుచుకుంది. ముంబైకి చెందిన జులేఖ అనాధాశ్రమంలో చదువుకుంది.స్పోర్ట్స్ టీచర్ అశోక్ రామచంద్రన్ నాంగ్రా ఆమెకు వాలీబాల్ లో శిక్షణ ఇచ్చారు రాష్ట్ర, అంతర్ రాష్ట్ర స్థాయిలో ఎన్నో గేమ్స్ ఆడింది జులేఖ. అటు తరువాత ఒలింపిక్స్ అవకాశం వచ్చింది. పేమెంట్ల దగ్గర భిక్షాటన చేసిన జులేఖ ఒలంపిక్స్ లో పాల్గొనడం ఎందరికో ఒక అద్భుతమైన స్ఫూర్తి.