శారీరక అనారోగ్యాలు,వాతావరణ కాలుష్యాలు మందరగా శిరోజాలపైనే ప్రభావం చూపిస్తాయి. పేలవంగా తయారయిన జుట్టు తిరిగి జీవం సంతరించుకోవాలంటే సి-విటమిన్ అత్యధికంగా లభించే ఉసిరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఉసిరి నుంచి దొరికే ఐరన్ రక్త వృద్ధిని చేకూరుస్తుంది. మాడుకు రక్త ప్రసరణ జరిగి జుట్టు బాగా పెరుగుతోంది. శిరోజాలు ఆరోగ్యంతో తేమగా నిగనిగలాడాలంటే కొబ్బరి నూనె క్రమం తప్పకుండా రాయాలి. కుంకుడుకాయ శీకాయ మంచి క్లెన్స్ ర్ లుగా జుట్టు ను శుభ్రం చేస్తాయి. రాత్రి పడుకోబోయే ముందర జుట్టుకు మోయిశ్చ రైజింగ్ క్రీమ్ అప్లయ్ చేయాలి . వెంట్రుకల చివర్లలో కొన్ని చుక్కల సీరమ్ తో మసాజ్ చేసుకోవాలి.

Leave a comment