నీహారికా ,

అందరం అమ్మ గురించి మాట్లాడుకుంటాం ,మరి తండ్రి ప్రభావం పిల్లల పై వుండదా అంటారు. కరెక్టే తల్లి కొంచెం దగ్గరగా ఉంటుంది కనుక పిలల్లకు సర్వ సదుపాయాలు తనే చూస్తుంది. కనుక ఒక వేళ  జాబ్ చేసే అమ్మయినా పిల్లల విషయంలో ఉన్న సమయం అంతా ఖర్చు పెడుతుంది. కనుక ఆలా అనిపిస్తుంది కానీ టీనేజ్ పిలల్ల పైన తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు గట్టిగా చెపుతున్నారు. టీనేజ్ ఆడపిల్లల్లో లెక్కలు కెమిస్ట్రీ వంటి కష్టమైన సబ్జెక్ట్ లలో రాణించాలంటే తండ్రి ప్రేమ చాలా అవసరం. అనేది వారి అభిప్రాయం అలాగే భాషా  పరిజ్ఞానం రావాలంటే కూడా తండ్రి ప్రేమ దగ్గరితనం పిలల్లతో ఎక్కువగా స్నేహంగా గడపటం కావాలి. వయసు పిల్లలు తల్లీ తండ్రీ ఆదరాపూర్వకమైన వాతావరణంలో వుంటే  ఎంతో ఉత్సాహంగా వుంటారు. జీవితంలో రాణించేందుకు ఇదెంతో  ఉపయోగపడుతుంది. తండ్రి ప్రేమ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతోంది కూడా. టీనేజ్ లో వుండే పిలల్లు తమ  శరీరంలో జీవితంలో అనుభవాలు ప్రతి నిమిషం కలిగే మార్పులనీ ఫీలింగ్స్ ని ముందస్తుగా తల్లి తండ్రులకే చెప్పుకునేంత స్నేహంగా వాళ్ళు మెలిగితే అసలు పిలల్ల జీవితాల్లో ఎలాంటి తప్పులూ జరగవు. ప్రతి విషయం  వాళ్ళతో  చెప్పుకుని తమ సమస్యల్ని తేలికగా పరిష్కరించుకోగలుగుతారు. పిలల్ల కొచ్చే ప్రతి సంకటాన్ని  వాళ్ళ ప్రతి చర్యలో అర్ధాన్ని తల్లితండ్రులు గ్రహిస్తే పిల్లల జీవితం బంగారమవుతుంది.

Leave a comment