జాన్వీ కాపూర్ నటించిన ధడక్ జులై 20న విడుదల కాబోతుంది. మరాఠీ చిత్రం సైరత్ కు ఇది రీమేక్. ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ .సైరత్ ఇంట్లో అమ్మతో కలిసి చూసాను. ఇలాంటి చిత్రంలో నేను కథానాయికగా పరిచయం కావాలని అమ్మ కోరుకొంది. కరణ్ జోహార్ కు ఈ చిత్రం గురించి ఫోన్ చేసి చెప్పింది. అలా ఇందులో నేను భాగం అయ్యాను అని చెప్పింది జాన్వీ. శ్రీదేవి మీకు నటన విషయంలో సలహాలు ఇచ్చేదా అన్నప్పుడు కష్టపడి పని చేయి ప్రతి భావాన్ని సొంతం చేసుకొని పలికించమంది. ఆ సలహా నేను శిరసావహించాను అన్నది జాన్వీ. జగదేక సుందరి శ్రీదేవికూతురు జాన్వీకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుందాం.

Leave a comment