ఉద్యోగినులైన తల్లులున్న పిల్లలు మిగతా వారితో పోల్చితే 200 శాతం ఎక్కువగా అనారోగ్యాలకు గురి అవుతున్నారని ఒక అధ్యయనం లో చెపుతుంది. 90 వేల మంది స్కూలు కు వెళ్ళే పిల్లలపై ఈ అధ్యయనం చేశారు. అలాగే తనకంటే చిన్నవాళ్ళు తమ్ముడో,చెల్లెలో ఉన్న పిల్లలు ఇలా అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు . తల్లిని మిస్ అవటం,తల్లితో పెరిగినవాళ్ళను , పసివాళ్ళను, ఇటు ఉద్యోగాన్ని ఒకే రకంగా చూసుకోలేకపోవటం వల్లనో అనారోగ్యాలు వస్తున్నాయి. తల్లి పర్యవేక్షణలో ఎక్కువ కేరింగ్ ఉండక, ఆహారం సరిగ్గ తినకా ,పరిశుభ్రత లోపించి ఇలాటి కారణాలతో పిల్లల్లో ఆస్తమా, ఫుడ్ పాయిజన్,గాయాలు కావటం, రాత్రికి రాత్రి హాస్పిటలైజేషన్ వంటి సమస్యలు వస్తున్నాయి. తల్లి ఉద్యోగిని అయితే ఇంటి ఆర్థిక పరిస్థితి బాగుపడి పిల్లలకు మంచి జీవన విధాన అవకాశాలు ఉంటాయి. కానీ అమ్మ దూరంగా ఉండటం వల్ల అనారోగ్యాలు చుట్టు ముడుతున్నాయని పరిశోధికులు చెపుతున్నారు.

Leave a comment