ఆడపిల్లల విషయంలో నేరాలు, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆడపిల్లలు కొన్ని జాగ్రత్తలు పాటించండి అంటున్నారు పోలీసు అధికారులు. కాస్త పరిచయం ఉన్నంత మాత్రాన వాళ్లను నమ్మి బైక్ పైన కార్ లోనూ వెళ్ళవద్దు. అలాగే రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణాలు వద్దు. తప్పనిసరి అయితే ఆటో అతని ముందే ఆటో నెంబర్ ఇంట్లో వాళ్లకి పంపించి మరీ ఎక్కండి. ఏదైనా అనుమానం అనిపిస్తే 100 నంబర్ కి కాల్ చేయాలి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి హెల్ప్ అందుతుంది. వెలుగు రాకముందు నిర్మానుష్య ప్రదేశాల్లో వాకింగ్ జాగింగ్ చేయొద్దు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియదు కనుక పెప్పర్ స్ప్రే తో  సహా అన్ని పర్స్ లో ఉంచుకోవాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు అన్న నమ్మకం ఉంటేనే ఒంటరిగా కాలు బయట పెట్టండి.

Leave a comment