అమ్మకావటం అనిర్వచనీయమైన ఆనందం.  అమ్మకో కొత్త బాధ్యత . పాపాయి అపురూపమే , కానీ అమ్మ పాపాయి పైన 24 గంటలు కేంద్రీకరించకూడదు.  ఇంట్లో ఉన్న అందరూ పాపాయిని ప్రేమిస్తారు కనుక వాళ్ళు కూడా పాపాయి పనుల్లో భాగాస్వాములుగా ఉండాలి ముఖ్యంగా కుటుంబం పాపాయి లాగా పాపాయి తల్లిని చూసుకోవాలి. అమ్మగా మారేందుకు ఆమె ఎంత కష్టం ఓర్చుకుందో పిల్లల పెంపకం ఎంతో కష్టమో అర్ధం చేసుకుంటే అమ్మ తేలిగ్గా ఉంటుంది. పాపాయికి పాలివ్వాలి కనుక వేళకు మంచి భోజనం చేసి తగినంత విశ్రాంతి తీసుకొని వెనకటి శరీరాన్నీ తిరిగి పొందాలి. పాపాయిని శ్రద్ధగా చూసుకుంటేనే, సొంత సమయానికి , వ్యక్తిగతానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

Leave a comment