పాపాయి ఇంటికి వస్తే ఆనందం ఇల్లు చిలుకలు వాలిన చెట్టు అయ్యిపోతుంది. కానీ కొత్తగా తల్లయిన అమ్మాయికి మాత్రం కొత్త పనులు ఎన్నో వచ్చి చేరి కంగారైపోతుంది. పాపాయి వచ్చే ముందు ఎక్కడ వేసిన దుప్పటి, హల్లో దిళ్ళు అన్నీ అమరికగా ఉంటాయి. కాని పాపాయి వచ్చాక వాళ్ళ న్యాపీలు, దుస్తులు, ఇల్లంతా చిందర వందరగా వుంటుంది. ఎప్పటికప్పుడు సర్దేసేందుకు కూడా వీలవ్వదు. పాపాయి గురించి ఎన్నో వస్తువులు, బెడ్ షీట్స్ పాపాయి కోసం వాడె వస్తువులు క్షణక్షణం పెరుకుంటాయి. అందుకే పాపాయిని ఆహ్వానిస్తేనే అమ్మ అయినా అమ్మాయికి ఎంతో సాయం అందించాలి. ఆమె కూడా పాపాయి పనులు అలవాటు చేసుకుని, ఇల్లు దిద్దుకునే ఓపిక వచ్చేదాకా కాస్త కంగారుగానే వుంటుంది. పాపాయికి ఒక్కోసారి పాలు సరిపోవు. వురికురికే ఆమెను కంగారు చేయకుండా డాక్టర్ సలహా తీసుకునే విషయంలో కూడా ఆమె సహకారం ఇవ్వాలి. అమ్మకి కూడా పాపాయి కొట్టే కదా.

Leave a comment