మా అమ్మ ఎంతో దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చేది.ఇంటి అవసరాలకు ఆమె నీళ్లు తేవాలి.ఇప్పుడు అనారోగ్యం పాలయిపోయింది.ఆమె కష్టం అంతా నీళ్ల మోతే.అందుకే బావి తవ్వేశాను.ఇంటి ముందే ఇప్పుడు మా బావి ఉంది వాకిట్లోనే అమ్మకు మంచినీరు దొరుకుతోంది అంటోంది బబితా సోరెన్. పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ కు చెందిన బబితా కుటుంబం ఏళ్ళ తరబడి నీటి ఇబ్బంది ఎదుర్కొంటోంది.బబిత ఏమో పొలిటికల్ సైన్స్ చేసి బిఈడి చదువుతోంది.హాస్టల్ లో ఉంటుంది కోవిడ్ -19 కారణంగా సెలవులు ఇచ్చారు.ఇంటికి వచ్చి భావి తవ్వటం మొదలుపెట్టింది.మా అమ్మ నే మనసులో పెట్టుకుని మూడు వారాల్లో 15 అడుగుల భావి తవ్వాను.నీళ్ళు పడ్డాయి ఇక మా అమ్మ కష్టాలు తీరిపోయాయి అంటోంది బబితా సోరెన్.

Leave a comment