సింధూ తాయి సప్కాల్ ను అమ్మ,మాయి అని పిలుస్తారు. 1042 మంది పిల్లలకు ఆమె అమ్మ. ఈమె కు 207 మంది అల్లుళ్ళు36 మంది కోడళ్లు, వేల మంది మనవళ్ళు ,మనవరాళ్ళు ఉన్నారు. ఆమె పెంచిన చాలా మంది డాక్టర్లు,లాయర్లు. సొంత కూతురుతో సహా కొంతమంది ఇంకెంతో మందికి అనాధాశ్రమాలు ఏర్పాటు చేశారు. అన్నట్లు ఆమెది మహారాష్ట్రలోని మేఘీ గ్రామం. భర్త వదిలేస్తే నిండు గర్భిణిగా ఉన్న ఆమె చాలా కష్టాలు పడింది. పిల్లలను పెంచుకుంటూ అడుక్కుంటూ రైల్వే స్టేషన్ లో అనాధాలు గా ఉన్న పిల్లలను చూసింది. వాళ్ళందరిని దగ్గర చేర్చుకుని పెద్ద చేసింది. ఈమె జీవితాన్ని మీ సిధూ తాయి సప్కాల్‌ పేరిట సినిమా తీశారు. ఇప్పటికి 750 అవార్డులు ఆమె సేవకు దక్కాయి. ఇప్పుడామే పూణేలోని హడ్సనర్ గ్రామంలో సమ్మతిబాల్ నికేతన్ నిర్మిస్తుంది.

Leave a comment