ప్రసవం తర్వాత బరువు తగ్గించుకోవటం ,కొత్త గా తల్లులైన వారి సమస్య. వీళ్ళ నిద్రకీ ,గర్భం ధరించన సమయంలో పెరిగిన బరువు తగ్గించుకొనే విషయానికీ సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు. ఒక తాజా రిపోర్ట్ ఏడు గంటలు,అంతకుమించి కాప్త ఎక్కువ సేపు ప్రశాంతంగా నిద్రపోయే తల్లులు త్వరగా బరువు తగ్గుతారు. సరిపడనంత విశ్రాంతి తరువాత వాళ్ళు పగలంతా చురుగ్గా ఉంటారు. దాన్తో కేలరీలు ఎక్కువగా ఖర్చు చేస్తారు. సరిగ్గా నిద్ర పట్టకపోతే పగలు కూడా అలసటతో ఏ పని చేయలేక ఇంకాస్తా బరువు పెరుగుతారు. సో విశ్రాంతి తీసుకొంటే చాలు .మీ బరువు దానంతట అదే తగ్గిపోతుంది అంటున్నారు

Leave a comment