Categories
WoW

అమ్మమ్మా నాయినమ్మలకు డోఖా లేదు.

మనం ప్రతి రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి కొన్ని వందల వేల పదాల తో ఎన్నెనో మాటలు మర్చి మాట్లాడుతుంటాం. ఈ పదాల్లో ఏది మనకు సంతోషం ఇస్తుందో ఎట్లా చెప్పగలం. కానీ స్వీడన్ పరిశోధనలో ఒక అడుగు ముందు వేసి, పదిహేను లక్షల పదాల పై పరిశోధన నిర్వహించారు. మనం మాట్లాదే పదాల్లో అమ్మమ్మా , నాయినమ్మా వంటి వరసలు, మనం, మనకు, నేను, మనది వంటి వ్యక్తిగత పదాలు సంతోషాన్ని కలిగిస్తాయని గుర్తించారు. ఐఫోన్, గూగుల్, ఫేస్ బుక్, వాట్సాప్ వంటి మెటీరియల్ పదాలు సంబంద బాంధవ్యాలకు సంబందించిన పదాల్లో సంతోషాన్నివ్వవు. మెటీరియల్ థింగ్స్ సంతోషం ఇవ్వవని కాదు కానీ, ఈ అనుభందాలు, పాశాలు మనకు సంతోషాన్ని ఎప్పటికీ ఇస్తూనే ఉంటాయని తేలింది. మనకు తెలియకుండానే మనం వాడె పదాల ప్రభావం మన సంతోషం పైన వుంటుంది.

Leave a comment