మా అమ్మంటే నాకు అమిత ప్రేమ అంటుంది తెలుగు మల్లేశ్వరి లో నటించిన కత్రీనా కైఫ్. ఇంగ్లాండ్ లో పెరిగిన కత్రినా బాలీవుడ్ లో హైయెస్ట్ పైడేడ్ యాక్టర్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది. నేను అమ్మ తో కలిసి పెరిగాను. నా స్నేహితులు వాళ్ళ నాన్నల గురించి చెప్పుతుంటే నాకు చాలా ఎదోలాగా అనిపించేది. అంతే కానీ పెద్దగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. నాకు అమ్మ అన్నీ ఇచ్చింది. ఆమె తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసారు. పుట్టగానే రోడ్డు ఆడపిల్లని రోడ్డు మీద వదిలేసే తల్లి దండ్రులు వదిలేసిన ఆడపిల్లలని ఆదుకునేందుకు రిలీఫ్ ప్రాజెక్ట్ ఇండియా ట్రస్ట్ పేరుతో సేవలు అందిస్తుంది. నేను మా అమ్మ రుణం తీర్చుకోవడం అంటూ ఆలోచిస్తే ఆమె ఆశయం కోసం పని చేయడమే అంటుంది కత్రినా కైఫ్.


 

Leave a comment