నమ్మకాలు చాలా మందిలో ఎక్కువే.  మంచి రోజులు , లక్కీనంబర్స్, లక్కీ కలర్స్, ఉంగరాలు అన్నింటినీ నమ్మేస్తారు. దీనికి సినిమా వాళ్ళు మినహాయింపు కాదు.  చాలా మంది స్టార్స్ కి ఎన్నేన్నో నమ్మకాలున్నాయి.  తమన్నా అయితే తను నంబర్ తో చెప్పేప్పుడు  కూడా పొరపాటున కూడా “ఎనిమిది” అన్న నంబర్ చెప్పదు.  కనీసం చాక్లెట్స్ తీసుకోనేప్పుడు కూడా ఈ ఎనిమిదిని  గుర్తుపెట్టుకొంటుందటా.  ఇది నా అన్ లక్కీ నంబర్ అంటుంది తమన్నా .  ఈ మధ్య ఇచ్చిన ఇంటర్యూలో  ఈ విషయం చెపుతూ తన అన్ లక్కీ నంబర్ గురించి చెప్పారు.  తనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం అని, షూటింగ్ పూర్తయ్యాక  ఇంటికొచ్చాక తను అందరి అమ్మాయిల్లాగే మామూలుగా ఉంటానని,  తను సెలబ్రెటీనని అనిపించదని, తన ఫ్రెండ్స్ అందరూ సినిమా ఇండస్ట్రీ  బయట వాళ్ళే అంటోంది తమన్నా.

Leave a comment