ఉసిరికాయలోని సి-విటమిన్ శిరోజాల రక్షణ కు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంట్లోనే ఉసిరికాయ పొడి తో ఎన్నో రకాల నూనె తయారు చేసుకోవచ్చు. రెండు స్పూన్ల ఉసిరి పొడి, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె కలిపి చాలా మరిగించాలి. నువ్వుల నూనెతో తల మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. ఉసిరి కాయ పొడి లో గుడ్డు వేసి గిలక్కొట్టి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు పెరుగుతుంది. టేబుల్ స్పూన్ చొప్పున ఉసిరి రసం, నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి పదినిమిషాలు వదిలేసి తలస్నానం చేయాలి ఇలా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే జుట్టు చక్కగా పెరుగుతుంది.

Leave a comment