ఈ చలి రోజుల్లో పొడిబారిన జుట్టు తో పాటు చుండ్రు సమస్య కూడా ఎక్కువే అవుతోంది. సమాన పరిమాణంలో కొబ్బరి నూనె ఆముదం వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే మాడుకు పట్టించి పది నిమిషాలు మృదువుగా మర్దన చేయాలి. గంట తర్వాత తల స్నానం చేయచ్చు . ఇది జుట్టు కుదుళ్ళకు పోషణ ఇస్తుంది. జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరగటంతో పాటు మృదువుగా కాంతివంతంగా ఉంటుంది నిద్రపోయే ముందుగా గోరువెచ్చగా చేసిన ఆముదం కనుబొమ్మల పై రాసి మర్దన చేయాలి కొన్ని రోజులు చేస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.