నాకిప్పుడు కొంచెం కొంచెం తెలుగు తెలుసు అంటుంది కైరా అద్వానీ. భావాద్వేగాలు అందరిలోనూ ఒక్కటే అలాగే నటనకు కూడా భాషా భేదాలు ఉండవు. భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు పక్కన అవకాశం వచ్చినప్పుడు అదెంతో అమూల్యమైనదిగా భావించాను . అప్పుడు నాకు భాష రాదని భయం వేయలేదు. పైగా మహేష్ కు సూపర్ స్టార్ ననే ఫీలింగ్ ఏమీ లేదు. సెట్లో అందరినీ సమానంగా చూస్తారు. నేను చాలా కంఫర్టబుల్ గా ఈ చిత్రంలో నటించగలిగాను. స్ర్కీప్ట్ ఎంతో బావుంది . ఈ ప్రాజెక్ట్ లో నాకు అవకాశం ఉండటం నా అదృష్టం అంటుంది కైరా అద్వానీ.

Leave a comment