కార్తీకమాసంలో ఉపవాసాలు చేసే వాళ్ళు అధికం అయితే ఈ నెల రోజుల పాటు ఉపవాసం ముగిశాక ఏదో ఒకటి అన్నట్లు తినకూడదు శరీరానికి శక్తినిచ్చేవి తినటం చాలా ముఖ్యం కొన్ని గంటల పాటు ఇవి తినకుండా ఉండి ఒకేసారి కొవ్వులుండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఉపవాసం తర్వాత పండ్లు తినటం మంచిది. పండ్లు తక్షణ శక్తిని ఇస్తాయి.రక్తంలో చక్కెర స్థాయి నియంత్రిస్తాయి. పండ్లలో నీటిశాతం ఎక్కువ కాబట్టి శరీరంలో ఉపవాసం వల్ల కోల్పోయిన నీటి భర్తీ చేసుకోవచ్చు.పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉండి సులభంగా జీర్ణమవుతాయి.

Leave a comment