అందం అభినయం గల రెండు రకాల పాత్రల్ని సంతూకం చేసుకోవాలన్నదే నా ఆరాటం అంటుంది కత్రినా కైఫ్. అన్ని వర్గాల ప్రజలు చూసి ఆనందించే సినిమాల్లో నటించడం నాకిష్టం. సినిమా ఎంటర్టైన్ మెంట్. అందరు ఆహ్లాదంగా సినిమా చూడాలి. చిత్రసీమలో మొదట్లో కొన్ని ఆటంకాలు వచ్చినా కమర్షీయల్ సినిమాల్లో ఆమె కెరీర్ గ్రాఫ్ చక్కగా ఉంది.14 సంవత్సరాల వయసులోనే మోడలింగ్ లో అడుగుపెట్టిన కత్రినా మొదటి నుంచి తన ప్రతిభ కనబరుస్తూనే ఉంది. మోడలింగ్లో ఆమె స్టైల్ కి డిజైనర్లే ఆశ్చర్యపడేవారట.అప్పట్లోనే లక్షలాది రూపాయలు విలువైన దుస్తులు ఆమెకు కానుకగా ఇచ్చేవారట. ఆమె ధరించి ప్రదర్శించిన ఏ దుస్తులకైనా అద్భుతమైన డిమాండ్ ఉండేదట.