ఈ సీజన్ లో పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు వెచ్చని భద్రత ఇవ్వకపోతే ఎన్నో అనారోగ్యాలు వచ్చేస్తాయి. వాళ్ళకు పరిశుభ్రంగా ఉండే దుస్తులు వెయ్యాలి. ఎప్పటికప్పుడు గాఢత లేని సబ్బుతో ఉతికి ఎంతో కొంత ఎండ తగిలేలా ఆ ఎండ వేడిలోనే ఆరనివ్వాలి. ఆహారం విషయంలో కూడా మరింత శ్రధ్ద కావాలి. వెజిటెబుల్ సూప్స్ ,చిలకడ దుంపలు పిల్లలకు చాలా మంచిది. వేడిగా ,మిరియాల పొడి వేసిన పాలు తాగిస్తే జలుబు ,దగ్గులు రావు. అలాగే శరీరం పొడి భారిపొకుండా గోరువెచ్చని నూనె లేదా బేబీ ఆయిల్ తో శరీరానికి మర్ధన చేయాలి. క్రిములు చేరకుండా ఎప్పటికప్పుడు చేతులు కాళ్ళు శభ్రం చేయాలి. చల్లని రోజుల్లో వాళ్ళకు ఎలాంటి అనారోగ్యాలు దగ్గరకు రాకుండా ఉంటాయి.

Leave a comment