ఇంటి దగ్గర వంట చేసుకోవడం బాక్స్ తీసుకు పోవడం వంటివి ఈ రోజుల్లో లేనట్లే. ఆఫీస్ లో ఉచితంగా మంచి లంచ్ ఎన్ని సార్లు కోరుకుంటే అన్ని సార్లు కాఫీ,టీ ,లెమన్ టీ వంటివి అందుబాటులో ఉండటం వల్ల ఇంటి భోజనం కరువైపోతుంది. ఆఫీస్ భోజనాల్లో పోషక పదార్ధాలు తక్కువ. అదనపు క్యాలరీలు ఉంటాయి.శాండ్ విచెస్, సాఫ్ట్ డ్రింక్స్ ,కేక్స్  ఫ్రెంఛ్ ప్రైస్ వంటివి ఎక్కువ స్నాక్స్ గా ఉంటాయి. ఇవన్ని ఆరోగ్యాన్ని చెడగొట్టేవే.వేగంగా జీర్ణం ఆయ్యేవి కావు, కొవ్వులు పేరుకుని శరీరం బరువెక్కడం జరుగుతుంది. రూపం చెడటంతో పాటు అనారోగ్యాలు వస్తాయి. అందుకే ఇంటి భోజనాన్ని మించింది లేదు. కాస్త కూర పెరుగు తో నైన ఇంటి నుంచి తీసుకుపోయిన భోజనం చేస్తే మేలు.

Leave a comment