పైనాపిల్ లో పొటాషియం పుష్కలంగా ఉండటంతో పాటు సమృద్దిగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్లనూ బీపి ని తగ్గించటంలో దంతాల చిగుళ్ళు బలంగా ఉంచటంలో ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి రక్షించడంలో ముందుంటుందట.క్యాన్సర్ రోగుల్లో రేడియేషన్ కారణంగా తలెత్తే దుష్పరిణామాలు ఇందులోని బొమిలైన్ అనే ఎంజైమ్ తగ్గించ గలుగుతుంది. పుండ్లు,గాయాలు మాన్పగలుగుతుంది.కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. సంతాన సాఫల్యానికి ఈ పండు ఎంతగానో ఉపకరిస్తుందట.ఇందులో ఉండే సీ విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది.కంటి కండరాల క్షీణతను తగ్గిస్తుంది.

Leave a comment