నీహారికా,

చాలా మంది తామం గురించి ఎంతో జాలితో ఉంటారు. అమ్మో నాకెన్ని సమస్యలు, ఎంత కష్ట పది పోతున్నానో అబ్బో, నేనెందుకు లెండి, నాకెందుకు అన్న డైలాగ్స్ చెప్పుతూ ఉంటారు. కానీ ఈ సెల్ఫ్ పిటి అంట ప్రమాదకరమైనది ఇంకొకటి లేదు. ఇది పాము విషం లాంటిది. దీన్ని దగ్గరకు రానివ్వకూడదు. ఎవరి జీవితాన్ని వారికి నచ్చినట్లు నడుపుకోవాలి గానీ అనుక్షణం సామాజిక అంచనాలను అందుకునేందుకు తహతహ లాడ కూడదు. దిగులుగా, విచారంగా వుంటే ఆ మూడ్ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను చుట్టు ముత్తేస్తుంది. దిగులు అంటూ వ్యాధిలా వ్యాపిస్తుంది. ఎవరి కంపెనీ వద్దనుకుంటాము కానీ ఎక్స్ పార్ట్స్ ఏం చెప్పుతున్నారంటే మూడ్ సరిగా లేనప్పుడు ఒంటరిగా ఉండాలనుకోవడం మరింత డిప్రెషన్ కు కారణం అవ్వుతుంది. అందుకే ఈ సెల్ఫ్ పిటి తో అనుక్షణం, మనపట్ల మనం జాలితో వుండటం, తామేదో కష్టాల్లో వున్నట్లు ఫీలవ్వడం నష్టమే. ఎలాంటి పరస్థితినైనా ఎదుర్కునే సమర్ధత తో వుండటం ఈ భాదని హరించేస్తుంది.  మనము మన చుట్టూ వున్న వాళ్ళ జీవితాలు బావుంటే ముందర ధైర్యంగా వుండాలి.

Leave a comment