పూర్తి స్థాయి యాక్టర్ ను కాస్తా పూర్తి స్థాయిలో అమ్మ పాత్రను పోషిస్తాను అంటుంది స్నేహ. కెరీర్ ను వ్యక్తిగత జీవితాన్ని సమంగా ఎంజాయ్ చేస్తున్నా. నా బిడ్డ ఎదుగుదలను పరిశీలిస్తున్నాను. ఇప్పుడు కొత్తగా తల్లి అయ్యే వాళ్ళకి సలహాలు కూడా ఇవ్వగలను అంటుంది స్నేహ. నా భర్త ప్రసన్న అయితే చాలా ప్రసన్నమైన తండ్రి మా అబ్బాయి విహాన్ పెంపకంలో ఇద్దరం సమానంగా ఉంటాం. ప్రసన్న అయితే వంటల్లో కొత్త ప్రయోగాలు చేస్తాడు. మా ముగ్గురి నడుమ చక్కని బాంధవ్యం ఉంది. ఒక్కోసారి షూటింగ్ కు నాతోపాటు విహాన్ ను కూడా తీసుకుపోతుంటాను. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రతి చిత్రం సెలబ్రిటి స్థాయి స్కృట్ని జరుగుతుంది. మన దేశంలో తారలకు పెళ్లయ్యాక ప్రొఫెషనల్‌ అంచనాలు మారుతుంటాయి. నా వరకు పెళ్ళయినా అబ్బాయి ఉన్నా అవకాశాలు తగ్గలేదంటుంది స్నేహ.

Leave a comment