Categories
Sogasu Chuda Tarama

అంచు మార్చేద్దాం……. డ్రెస్సు కుట్టేద్దాం.

ఎన్నో చీరలు ఇంట్లో పోగుబడి పోతుంటాయి. కొత్తవి కొంటు పొతే పాతవి అడుగుకి పోతూ ఉంటాయి. పొనీ అలా పాత బడినా అందమైన చీరకు, జర్దోసీ పనితనం వున్న కుందన్లు పొదిగిన ఎన్నో జరీ బార్డర్స్ మార్కెట్  లో దొరుకుతున్నాయి. పాత చీర అంచు తీసేసి ఈ కొత్త అంచు జత చేసి చూడండి. అలాగే ఎక్కడో కొంత చిరుగు పట్టి వుంటుందో అందమైన పట్టు చీర, దీన్ని డ్రెస్ కింద కుట్టించేయిచ్చు. ఇప్పుడు సారీల డ్రెస్ నయా ఫ్యాషనే. అక్కడక్కడా ఎంబ్రాయిడరీ చేయిస్తే సరి పాత కాంజీవరంతో కుట్టించిన దుస్తులను ఇంట్లో అమ్మాయిలు ఇష్టంగా వేసుకుంటున్నారు. అలంటి మెటీరియల్ కావాలన్నా విడిగా దొరకదు కదా. అలాగే కాస్త పాతబడిన అందమైన చీరలకు ప్యాచ్ వర్క్ గులబీలు కుట్టేస్తే ఎంత అందంగా ఉంటాయి. చక్కని మన్నికైన క్లాత్ పైన పాచ్ వర్క్ చేసిన గులాబీలు నిజంగానే బజార్లన్నీ గాలించినా ఇంకాళ్ళకి దొరకవు. ఇక జరీ అంచులతో బ్యాగ్ లు, సెల్ ఫోన్ పౌచ్ లు అయితే అడిరిపోతాయి. కాస్త కొత్తగా ట్రై చేయాలి అంతే.

Leave a comment